అనంతపురం: టీడీపీకి అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథర్ రెడ్డి ఆదివారం నాడు రాజీనామా చేశారు. గుర్నాథ్ రెడ్డితో పాటు మరో ఐదుగురు కార్పోరేటర్లు కూడ టీడీపీకి రాజీనామా చేశారు.

అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఏడాది కొంత కాలం క్రితం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గుర్నాథ్ రెడ్డికి టీడీపీలో చేర్పించడంలో  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అప్పట్లో ప్రచారంలో ఉంది.

అనంతపురం ఎమ్మెల్యే ప్రబాకర్ చౌదరికి, గుర్నాథ్ రెడ్డికి పొసగడం లేదు. దీంతో గుర్నాథ్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించనున్నట్టు గుర్నాథ్ రెడ్డి ప్రకటించారు.

చంద్రబాబునాయుడు పాలన బాగుందని తాను టీడీపీలో చేరినట్టు గురునాథ్ రెడ్డి చెప్పారు.టీడీపీలో చేరి తప్పు చేశానని ఆయన అభిప్రాయపడ్డారు.