మేకప్ వేసుకొని తిరుగుతున్నారా?: మంత్రి రజనిపై చింతమనేని వివాదాస్పద వ్యాఖ్యలు

ఏలూరు  ప్రభుత్వాసుపత్రిలో  సౌకర్యాలు  లేకపోవడంపై మంత్రి రజనిపై  మాజీ ఎమ్మెల్యే  చింతమనేని  ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Former  MLA  Chintamaeneni  Prabhakar Controversial  Comments On  Minister  Vidudala Rajani lns

ఏలూరు: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖమంత్రి విడుదల రజనిపై  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే  చింతమనేని  వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు.  మంత్రి రజని మేకప్ వేసుకొని తిరగడం తప్ప  చేసేదేమీ లేదన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో  సరైన సౌకర్యాలు లేకపోవడంపై  చింతమనేని ప్రభాకర్ సీరియస్ అయ్యారు.   ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో  బాధితురాలు  ప్రియాంకను చింతమనేని  ప్రభాకర్ ఆదివారంనాడు  పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో   సౌకర్యాలు లేని విషయాన్ని గుర్తించారు.   ఆసుపత్రిలో  సౌకర్యాల విషయమై   సూపరింటెండ్  కు ఫోన్  చేశారు. ఫోన్ లోనే  చింతమనేని సూపరింటెండ్ పై  సీరియస్ అయ్యారు.  బర్నింగ్  వార్డులో  ఏసీలు  పనిచేయకపోవడంపై  సూపరింటెండ్ పై ఆగ్రహం వ్యక్తం  చేశారు. గంటసేపు ఈ వార్డులో కూర్చోవాలని సూపరింటెండ్ ను కోరారు.  నిధులు లేకపోతే  ప్రభుత్వం నుండి తెప్పించుకోవాలని  చింతమనేని  ప్రభాకర్ చెప్పారు

also read:రూ. 150 కోట్ల ఖర్చుకు రెడీ, గన్నవరంలో దమ్మునోడే నిలుపుతాం: చింతమనేని సంచలనం

.  కలెక్టర్ , మీరు ఏం చేస్తున్నారని  ఆయన  ప్రశ్నించారు.  మంత్రి  విడుదల రజని  ఏం చేస్తున్నారన్నారు. మేకప్ వేసుకొని  తిరుగుతున్నారా అని ఆయన  అడిగారు.   జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా మార్చినా నిధులివ్వరా అని ఆయన ప్రశ్నించారు. డీఎంఈ వద్దకు వెళ్లి నిధులు తెచ్చుకోవాలని  చింతమనేని ప్రభాకర్ సూపరింటెండ్  ను  కోరారు.  డీఎంఈ తెలంగాణలో ఉన్నారా అని  ఆయన  అడిగారు.  ఏలూరు ప్రభుత్వాసుపత్రిని  మెడికల్ కాలేజీగా  చంద్రబాబు  సీఎంగా ఉన్నప్పుడే  శంకుస్థాపన  చేశారని  ఆయన  గుర్తు  చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios