యువతను రెచ్చగొట్టేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: కేసు నమోదుకై మాజీ మంత్రి వెల్లంపల్లి డిమాండ్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటరిచ్చారు. నిన్న శ్రీకాకుళంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.
విజయవాడ:శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిన్న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.ఈ విమర్శలపై మంత్రులు కౌంటరిచ్చారు. పవన్ గ్లాస్ ఎప్పుడో పగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. యువతను రెచ్చగొట్టేలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన పోలీస్ శాఖను కోరారు.
also read:సంకుచిత బుద్దికి నిదర్శనం: రోజా, అంబటిపై పవన్ విమర్శలకు మంత్రి అప్పలరాజు కౌంటర్
పవన్ కళ్యాణ్ కి అసలు వ్యూహమే లేదన్నారు. ప్యాకేజీ వ్యూహం తప్ప మరోటి పవన్ కళ్యాణ్ లేదని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ వంద రెట్లు మేలన్నారు. ఏపీ రాష్ట్రానికి నష్టం చేసేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలున్నాయని ఆయన ఆరోపించారు. కేఏ పాల్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్వంతంగా పోటీ చేయలేని పవన్ కళ్యాణ్ పార్టీని ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని తాము ఎప్పుడో చెప్పామని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీని సవాల్ చేసే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని ఆయన అన్నారు.