Asianet News TeluguAsianet News Telugu

సంకుచిత బుద్దికి నిదర్శనం: రోజా, అంబటిపై పవన్ విమర్శలకు మంత్రి అప్పలరాజు కౌంటర్

 ఏపీ సీఎం జగన్ సహా మంత్రులపై పవన్ కళ్యాణ్  చేసిన విమర్శలకు  ఏపీ మంత్రి అప్పలరాజు  కౌంటర్ ఇచ్చారు.  చంద్రబాబు  ఇచ్చిన ప్యాకేజీ మేరకు  పవన్ కళ్యాణ్  వ్యవహరిస్తున్నాడని  ఆయన  మండిపడ్డారు

AP Minister Appalaraju reacts on janasena chief pawan kalyan comments
Author
First Published Jan 13, 2023, 12:48 PM IST

అమరావతి: మంత్రి రోజాను డైమండ్ రాణి అనడం జనసేన చీఫ్  పవన్ కల్యాణ్  సంకుచిత బుద్ధికి నిదర్శనమని  ఏపీ   మంత్రి అప్పలరాజు  పేర్కొన్నారు. శుక్రవారం నాడు  మంత్రి అప్పలరాజు  తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.  నిన్న శ్రీకాకుళంలో  జరిగిన  జనసేన సభలో  వైసీపీపై  పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.  ఈ విమర్శలకు  మంత్రి అప్పలరాజు  కౌంటరిచ్చారు. మంత్రులు  రోజా,  అంబటి  రాంబాబులపై   పవన్ కళ్యాణ్  చేసిన విమర్శలపై   మంత్రి అప్పలరాజు సీరియస్ అయ్యారు.   రోజా రెండు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిందన్నారు.  ప్రస్తుతం  మంత్రిగా  పనిచేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా  కూడా గెలువలేదన్నారు. పోటీ చేసిన  రెండు చోట్ల  ఓటమి పాలయ్యాడని  అప్పలరాజు  ఎద్దేవా  చేశారు. అంబటి రాంబాబు రాజకీయ అనుభవం ముందు పవన్ కల్యాణ్  ఎంత అని  ఆయన ప్రశ్నించారు.  

సీఎం జగన్‌ మీద పవన్‌ కల్యాణ్‌కు అసూయ, ఈర్ష్య. భయం ఉందన్నారు. కానీ చంద్రబాబు మీద  అంత ప్రేమ. ఉందో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  నిన్ను కన్నతల్లిని కూడా చంద్రబాబు తిట్టించారన్నారు. అయినాచంద్రబాబును ఎందుకు ప్రేమిస్తున్నావని  ఆయన  అడిగారు.  చంద్రబాబు వలన రాష్ట్రానికి ఒరిగిందేమిటని  ఆయన ప్రశ్నించారు. ఎదురుగా రావడమంటే.రాజకీయంగా ఎదుర్కోవడమనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని మంత్రి అప్పలరాజు సూచించారు. ప్యాకేజీ తీసుకుని వ్యూహం అంటాడని పవన్ కళ్యాణ్ పై మంత్రి విమర్శలు గుప్పించారు. వాడి బొందా..... అదేమీ వ్యూహమని  మంత్రి పవన్ కళ్యాణ్ పై  మండిపడ్డారు.  గెలవడానికి వ్యూహం ఉండాలన్నారు.  ఓడించడానికి వ్యూహం  అవసరం లేదని  మంత్రి అప్పలరాజు  అభిప్రాయపడ్డారు.  

రాష్ట్ర విభజన నుంచి కూడా చంద్రబాబు పాఠాలు నేర్చుకోలేదని ఆయన చెప్పారు.హైదరాబాద్‌లో కేంద్రీకృత అభివృద్ధి వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు.అమరావతిలో కూడా చంద్రబాబు కేంద్రీకృత అభివృద్ది అంటున్నాదన్నారు. 
అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే ఉద్యమాలు వచ్చే అవకాశముందని మంత్రి అప్పలరాజు అభిప్రాయపడ్డారు. 

also read:ఈ జన్మకు సీఎం కాలేడు: పవన్ కళ్యాణ్ కు మంత్రి అప్పలరాజు కౌంటర్

తాను  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా భయపడలేదని  పవన్ కళ్యాణ్  చేసిన  వ్యాఖ్యలపై  మంత్రి అప్పలరాజు  స్పందించారు.  కాంగ్రెస్ ను  ఇష్టం వచ్చినట్టుగా  ప్రజా రాజ్యం  నేతగా  పవన్  కళ్యాణ్ తిట్టాడన్నారు. కానీ, అదే  కాంగ్రెస్ పార్టీలో  ప్రజా రాజ్యాన్ని చిరంజీవి విలీనం చేశాడని మంత్రి అప్పలరాజు గుర్తు  చేశారు.  ప్రజారాజ్యాన్ని చిరంజీవి ఆనాడు  కాంగ్రెస్ లో వీలీనం చేసిన  సమయంలో  నీవు ఏం చేశావని  మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios