ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు బయటకు రావాలి: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ విషయమై వాస్తవాలు బయటకు రావాలని మ ాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఎవరూ ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై పార్టీ నాయకత్వం నిర్ణయించనుందన్నారు.
తిరుపతి: ఫోన్ ట్యాపింగ్ పై అసలు విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. శనివారం నాడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒకరి గుట్టుు మరొక నేత బయట పెట్టుకుంటున్నారని వైసీపీ నేతల తీరుపై చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ దుర్మార్గాలను తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు. కానీ తాము చెబుతున్న విషయాలను పెద్దగా ప్రజలు పట్టించుకోలేదన్నారు. కానీ వైసీపీకి చెందిన నేతలే తమ లోగుట్లను బయటపెడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మంత్రులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం జరిగిందో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
also read:కోటంరెడ్డికి జగన్ సర్కార్ షాక్: సెక్యూరిటీ తగ్గింపు
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి టీడీపీ అభ్యర్ధిగా తాను బరిలోకి దిగుతానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో సంభాషణ గురించి మీడియా ప్రస్తావించగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో ఎవరూ ఎక్కడి నుండి పోటీచేయాలనే విషయమై జిల్లాకు చెందిన నేతలతో పార్టీ అధినాయకత్వం చర్చించనుందన్నారు. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారో ప్రకటించే అర్హత తనకు కూడా లేదన్నారు. పార్టీ నాయకత్వమే ఈ విషయమై నిర్ణయిస్తుదని ఆయన స్పష్టం చేశారు.
తన ఫోన్ ను జగన్ సర్కార్ ట్యాపింగ్ చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు. టీడీపీలో చేరడానికి నిర్ణయించుకుని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జీగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించి ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది వైసీపీ నాయకత్వం.