అమరావతి:అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టనున్న సర్కార్

పలనా వికేంద్రీకరణ బిల్లును ఈ నెల 20వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. 

Ap government to introduce ap decentralize and equal devolapment regions act


అమరావతి: పాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును  ఏపీ ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన ప్రవేశపెట్టనుంది.  ఏపీ డిసెంట్రలైజ్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్స్‌ యాక్ట్‌ 2020 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Also read:బాబుకు షాక్: టీడీఎల్పీ భేటీకి గంటా, వాసుపల్లి, 12 మంది ఎమ్మెల్సీల డుమ్మా

Also read:వంశీ, మద్దాల గిరికి టీడీపీ విప్:వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు

ఈ నెల 20వ తేదీన ఉదయం  ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది.ఈ సమావేశంలో పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్‌డీఏ రద్దు బిల్లు రేపటి సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు దిశగా ఏర్పాటు  ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ఇందులో భాగంగానే  పాలనా వికేంద్రీకరణ బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఏపీ సీఎం వైఎస్ జగన్  మంత్రులతో చర్చించారు.

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. మండలిలో వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ మంది సభ్యులున్నారు. శాసనమండలిలో ఈ బిల్లును గట్టెక్కించుకొనేందుకు అవలంభించిన  వ్యూహాంపై జగన్ డిప్యూటీ సీఎంతో చర్చించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios