వాలంటర్లంటే వణుకు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: పవన్ కు పేర్ని నాని కౌంటర్

వాలంటీర్లపై  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని  మాజీ మంత్రి పేర్నినాని  కోరారు. 

Former  Minister  Perni Nani  Reacts  on  Pawan Kalyan Comments lns

అమరావతి: జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ  అంటే  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గజ గజ వణికిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని  చెప్పారు. అందుకే  వాలంటీర్లకు వ్యతిరేకంగా  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని  మాజీ మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి పేర్నినాని  సోమవారంనాడు  తాడేపల్లిలో  మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లపై  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై  పేర్నినాని  కౌంటరిచ్చారు.  ఈ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.  

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు  వాలంటీర్లంటే  వణుకు అని ఆయన  చెప్పారు.  ఒంటరి మహిళను రెడ్ లైట్ ఏరియాకు అమ్మేస్తున్నారని మాట్లాడొచ్చా అని  పేర్ని నాని ప్రశ్నించారు.   చంద్రబాబు జపం చేయడం తప్ప పవన్ కళ్యాణ్ కు మరో పని లేదన్నారు.   

తమ ప్రభుత్వం వస్తే  వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తామని దమ్ముంటే  మీ మేనిఫెస్టోల్లో పెట్టాలని  టీడీపీ, జనసేనలకు  ఆయన సవాల్ విసిరారు.  రాష్ట్రం నుండి  30 వేల మంది మహిళలు   అదృశ్యమయ్యారని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయని  పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు పేర్నినాని.  


రాష్ట్రంలో  వాలంటీర్లుగా పనిచేస్తున్న వారిలో  1.90 లక్షల మంది మహిళలే ఉన్నారన్నారు. వాలంటీర్లు  చేస్తున్న సేవ పవన్ కళ్యాణ్ కు కన్పించడం లేదా  అని  మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.  వాలంటీర్లపై  తాను  చేసిన వ్యాఖ్యలను  పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలని  పేర్ని నాని డిమాండ్  చేశారు.   వైఎస్ఆర్‌సీపీ ఏనాడూ మీ తల్లి, మీ భార్య గురించి తప్పుగా మాట్లాడలేదే అని మాజీ మంత్రి  నాని గుర్తు  చేశారు.  రాజకీకంగా రెచ్చగొట్టేందుకు  పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ పదవుల  కోసం ఇంత దిగజారి మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు.  కొల్లేరుపై  కూడ పవన్ కళ్యాణ్ ఇష్టారీతిలో మాట్లాడుతున్నారన్నారు. 

గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు.  రాష్ట్రంలో మూడు కొత్త పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టుగా  పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ ఒక్క మెడికల్ కాలేజీని తీసుకువచ్చిందా అని ఆయన అడిగారు. 

సీఎం జగన్ ను ఏకవచనంతో పిలుస్తామని  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై  కూడ  ఆయన  స్పందించారు.  తాము కూడ పవన్ కళ్యాణ్ రీతిలోనే సమాధానం చెబుతామన్నారు.  మాకు కూడ నోరుంది. పవన్ కళ్యాణే నోరుందా అని  పేర్ని నాని ప్రశ్నించారు.  

 ప్రభుత్వంపై  పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని ఈ వ్యాఖ్యలను  చూస్తే అర్థమౌతుందన్నారు. వైఎస్ జగన్ పై  ఉన్న విద్వేషం పవన్ కళ్యాణ్ మాటల్లో కన్పించిందన్నారు. అంతేకాదు  చంద్రబాబుపై  ప్రేమ కూడ కన్పించిందని ఆయన  చెప్పారు.

 చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారని  పేర్నినాని  విమర్శించారు. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ పై  పవన్ కళ్యాణ్  ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని  పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారంగా  రాష్ట్రంలో 2015లో  3216 మంది, 2016 లో3089 మంది,  2017లో 3744 మంది,2018లో  4232 మంది, 2019 మే చివరి నాటికి 2484 మంది మహిళలు రాష్ట్రంలో అదృశ్యమయ్యారని  కేసులు నమోదైనట్టుగా  పేర్ని నాని చెప్పారు. 

also read:పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు.. వివరాలు ఇవే..

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 16, 765 మంది  మహిళలు అదృశ్యమయ్యారని కేసులు నమోదయ్యాయన్నారు. ఇక  వైఎస్ జగన్ సీఎం అయ్యాక  రాష్ట్రంలో ఈ తరహా కేసులు  అతి తక్కువగా నమోదయ్యాయన్నారు. చంద్రబాబు హయంలో  మహిళల మిస్సింగ్ పై  పవన్ కళ్యాణ్ ఎందుకు  మాట్లాడడం లేదని  ఆయన  ప్రశ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios