Asianet News TeluguAsianet News Telugu

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కా‌మ్‌కి బాబే కారణం: ఏపీ అసెంబ్లీలో పేర్నినాని


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై  ఇవాళ ఏపీ అసెంబ్లీలో జరిగిన  స్వల్పకాలిక చర్చలో చంద్రబాబుపై  మాజీ మంత్రి పేర్నినాని విమర్శలు చేశారు.  ఈ స్కాం వెనుక చంద్రబాబే సూత్రధారి ఆయన ఆరోపించారు.

Former Minister Perni nani Allges on Chandrababu in AP Skill Development Case lns
Author
First Published Sep 22, 2023, 1:12 PM IST

అమరావతి:స్కిల్ స్కామ్ కు  కథ, స్క్రీన్ ప్లై, దర్శకత్వం చంద్రబాబుదేనని పేర్నినాని ఆరోపించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై  శుక్రవారంనాడు ఏపీ అసెంబ్లీలో  స్వల్పకాలిక చర్చ జరిగింది.ఈ చర్చలో  మాజీ మంత్రి పేర్నినాని ప్రసంగించారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో  డబ్బులను  దోచుకోవడం కోసం చంద్రబాబు ఎంతో ఆత్రంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.ఈ స్కాం ఏమిటన్నది చంద్రబాబు మనవడికి కూడ అర్ధమౌతుందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  స్కాం కుట్రకు చంద్రబాబు తెరలేపారని పేర్నినాని ఆరోపించారు.  ఈ క్రమంలోనే  గంటా సుబ్బారావును తీసుకొచ్చి అందలం ఎక్కించారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఏం జరుగుతుందో చంద్రబాబు, గంటా సుబ్బారావుకు తప్ప ఎవరికీ తెలియదన్నారు.జీవోలో  రూ. 3 వేల కోట్లుంటాయన్నారు. కానీ ఆ విషయాలు బయటకు రాలేదన్నారు.జీవో ఇచ్చిన రోజునే ఒప్పందం చేసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు.డిజైన్ టెక్ ప్రతినిధి కలిసిన 19 రోజుల్లోనే స్కిల్ డెవలప్ మెంట్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.

ఒప్పందంలో భాగంగా  సీమెన్స్ కంపెనీకి కాకుండా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బులు ఎందుకు పంపారని  పేర్ని నాని ప్రశ్నించారు.సీమెన్స్ కు కాకుండా డిజైన్ టెక్ కు డబ్బులు పంపాలని ఎవరూ అడగలేదన్నారు.డిజైన్‌టెక్ ముందుగానే  ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీలకు నిధులు తరలించిందని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు.డొల్ల కంపెనీల నుండి మరిన్ని డొల్ల కంపెనీలకు నిధులను తరలించారని చెప్పారు.అక్కడి నుండి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ కు ఆ డబ్బులు చేరాయని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు.సీమెన్స్ కంపెనీ నుండి నయాపైసా రాకుండానే రూ. 371 కోట్లు ఎలా విడుదల చేశారని  ఆయన  ప్రశ్నించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడు 13 చోట్ల సంతకాలు పెట్టారని  పేర్ని నాని  ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పీఏ, కిలారి రాజేష్ కు డబ్బు చేరిందనేది వాస్తవం కాదా అని పేర్ని నాని ప్రశ్నించారు. పీవీఎస్‌పీ అనే షెల్ కంపెనీకి డబ్బులు బదిలీ చేశారని  నాని చెప్పారు.డొల్ల కంపెనీల నుండి హవాలా మార్గంలో వ్యక్తులకు చేరిందని  పేర్ని నాని వివరించారు. ఎంఓయూ, జీవోకు సంబంధమే లేదని  పేర్ని నాని తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో ఐఎఎస్ అధికారుల అభ్యంతరాలను పట్టించుకోలేదని  పేర్ని నాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఒప్పందంపై చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  అరెస్టైన చంద్రబాబును ఈ విషయమై సీఐడీ అధికారులు ప్రశ్నిస్తే  ఏమో, నాకు తెలియదు, గుర్తు లేదనే సమాధానాలు చెబుతున్నారన్నారు. ఈ స్కాంపై  కోర్టుల్లో జరుగుతున్న విచారణ సమయంలో చంద్రబాబు లాయర్లు స్కాం జరగలేదని వాదించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సెక్షన్ 17ఏ వర్తించదని వాదించిన విషయాన్ని పేర్ని నాని చెప్పారు. కానీ తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఎందుకు చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ కుంభకోణానికి సూత్రధారి ఇప్పుడు జైల్లో ఉన్నారన్నారు.వ్యక్తులు, డబ్బుల కంటే చట్టం, న్యాయం బలమైవన్నారు పేర్నినాని. 
 

Follow Us:
Download App:
  • android
  • ios