ఏలూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు మాజీ మంత్రి పీతల సుజాత డుమ్మా కొట్టారు. పార్టీ కమిటీల్లో ఆమెకు ప్రాతినిథ్యం కల్పించకపోవడంతో అలక బూనారనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఆమె లోకేష్ టూర్ కు దూరమయ్యారా అనే చర్చ సాగుతోంది.ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న జిల్లాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు. సోమవారం నాడు ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.

ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో వరద బాధితుల సహాయ పునరావాస కేంద్రాన్ని లోకేష్ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. 

ఈ పర్యటనకు మాజీ మంత్రి పీతల సుజాత గైర్హాజరయ్యారు. కొంత కాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఇవాళ లోకేష్ టూర్ కు కూడ దూరంగా ఉన్నారని పార్టీలో కొందరు నేతలు గుర్తు చేశారు.

also read:చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

పార్టీ ఇటీవల ప్రకటించిన కమిటీల్లో పీతల సుజాతకు చోటు దక్కలేదు. దీంతో ఆమె అసంతృప్తితో ఉందనే ప్రచారం కూడ ఉంది.

2019 ఎన్నికల్లో పీతల సుజాతకు టీడీపీ టిక్కెట్టు ఇవ్వలేదు. పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో పాటు పార్టీ కమిటీల్లో చోటు దక్కకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.