అమరావతి: పలువురు మాజీ టీడీపీ నేతలు ఆదివారం నాడు  బీజేపీలో చేరారు.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమక్షంలో  వారు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య,  టీడీపీ మాజీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, ఆర్యవైశ్య కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ సిద్దా వెంకటేశ్వరరావు తదితరులు ఆదివారం నాడు బీజేపీలో చేరారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు కూడ బీజేపీలో చేరారు.