ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి మాణక్యాలరావు. తాను బీజేపీకి దూరంగా లేనని కలిసే ఉన్నానని వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తో పనిచేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీజేపీని విమర్శించి ఇప్పుడు కవలవాలని ప్రయత్నిస్తారా అంటూ మండిపడ్డారు. 

బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలంటే గత ఎన్నికల్లో కలిసి పనిచేయనందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. బీజేపీ సభ్యత్వం తీసుకుని పోరాటం చేస్తే ఒకేనని లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము పరిగణలోకి తీసుకునేదే లేదన్నారు మాజీమంత్రి మాణిక్యాలరావు. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అధికా పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్నా గతంలో పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన మిత్ర పక్షాలు మాత్రం వేర్వేరుగా స్పందిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు సమర్థిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ బీజేపీపి దూరమయ్యారని ఏనాడు చెప్పలేదని బీజేపీతో ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశారని అందులో తప్పేంటని మాజీమంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు చేస్తున్న విమర్శలు అత్యంత దారుణమంటూ తిట్టిపోశారు. 

పేరు మాది బుల్లెట్ మీదా, అలా అయితే కుదరదు : పవన్ కు బీజేపీ కౌంటర్

ఇదిలా ఉంటే నిన్న మెున్నటి వరకు పవన్ కళ్యాణ్ పార్టీకి మిత్రపక్షమైన సీపీఐ పార్టీ మాత్రం ఖండిస్తోంది. మోదీ, షాలను పవన్ కళ్యాణ్ వెనకేసుకు రావడం సరికాదంటుంది. మోదీ, షాలు రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. 

ప్రాంతీయ పార్టీల నేతలను  మోదీ, షాలు భయపెడుతున్నారని అలాంటి వ్యక్తులు కరెక్టా అని నిలదీశారు. ఎందుకు కరెక్టో పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని వారిని ఎలా వెనకేసుకు వస్తారంటూ విరుచుకుపడ్డారు. 

మెుత్తానికి ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే మోదీ, షాలాంటి వ్యక్తులు కరెక్ట్ అని వారైతేనే ఉక్కుపాదంతో తొక్కేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

   ఆడపిల్లల మాన ప్రాణాలంటే పవన్ కు ఇంత చులకనా...: మంత్రి పుష్ప శ్రీవాణి ఫైర్

షాపై పవన్ వ్యాఖ్యలు: విపక్షాల్లో చీలిక, వైసీపీతో గొంతు కలిపిన మిత్రపార్టీ