పేరు మాది బుల్లెట్ మీదా, అలా అయితే కుదరదు : పవన్ కు బీజేపీ కౌంటర్

రాజకీయ కారణాలతో తమ భుజాలపై నుంచి 6 అడుగుల బుల్లెట్‌ను వేరేవారిపైకి సంధించాలనుకుంటే అది పొరపాటేనని జీవీఎల్ స్పష్టం చేశారు. మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

Bjp mp GVL Narasimha rao condemned Janasena chief Pawan kalyan comments

న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. తాను బీజేపీకి దూరంగా లేనని కలిసే ఉన్నానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జీవీఎల్ నరసింహారావు స్వాగతించారు.  

బీజేపీతో కలిసే ఉన్నామని కేంద్రం పెద్దలంటే తమకు గౌరవమని పవన్‌‌, టీడీపీ నేతలు చెప్పడం మంచి పరిణామమేనన్నారు. తమ విధానాలు నచ్చి బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

వైఎస్ జగన్ కు చెక్: బిజెపి తురుపుముక్క పవన్ కల్యాణ్?

ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని ఎంపీ జీవీఎల్ ప్రకటించారు. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని అవసరమైతే అందుకు తనవంతు సహకారం కూడా అందిస్తానని జీవీఎల్ భరోసా ఇచ్చారు.
 
ఎన్నికల ముందే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని తాము కోరినట్లు చెప్పుకొచ్చారు. ఆనాడు విలీనానికి పవన్ కళ్యాణ్ అంగీకరించలేదని స్పస్టం చేశారు. అయినా పొత్తులకు ఇది సమయం కాదని స్పష్టం చేశారు. 

బీజేపీకి దగ్గరే .. దూరమయ్యానని ఎవరు చెప్పారు: పవన్ కీలక వ్యాఖ్యలు

రాజకీయ కారణాలతో తమ భుజాలపై నుంచి 6 అడుగుల బుల్లెట్‌ను వేరేవారిపైకి సంధించాలనుకుంటే అది పొరపాటేనని జీవీఎల్ స్పష్టం చేశారు. మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

మత ఘర్షణలకు హిందువులే కారణమనడం రాజకీయ దురుద్దేశంలో భాగమేనని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వొద్దనేది బీజేపీ సిద్ధాంతమని చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా తాము ప్రశ్నించినట్లు జీవీఎల్ తెలిపారు. 

షాపై పవన్ వ్యాఖ్యలు: విపక్షాల్లో చీలిక, వైసీపీతో గొంతు కలిపిన మిత్రపార్టీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios