లోకేష్ సమర్ధుడైతే మహిళలు రోడ్లపైకి ఎందుకొస్తారు: కొడాలి నాని సెటైర్లు

నారా భువనేశ్వరి  నిజం గెలవాలి బస్సు యాత్రపై  మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. నిజం గెలిచినందునే చంద్రబాబు  జైల్లో ఉన్నారన్నారు.

 Former Minister  Kodali Nani  Satirical Comments on  Nara Lokesh  lns

విజయవాడ:లోకేష్ సమర్ధుడైతే  ఇంట్లోని మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని మాజీ మంత్రి  కొడాలి నాని ప్రశ్నించారు.బుధవారంనాడు ఏపీ మంత్రి  కొడాలి నాని  గుడివాడలో  మీడియాతో మాట్లాడారు. లోకేష్ ఢీల్లీ పారిపోయి తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని ఆయన విమర్శించారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందన్నారు. 

 నిజం గెలిచింది కాబట్టే  చంద్రబాబు జైల్లో ఉన్నారని కొడాలి నాని పేర్కొన్నారు. భువనేశ్వరి నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో జైలు నుండి బయటకు రారన్నారు.చంద్రబాబు కుటుంబమంతా  అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని చెప్పారు.ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఏ స్థితిలో ఉన్నారు. భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారని ఆయన  ప్రశ్నించారు.రెండెకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ. 2 వేల కోట్లు దాటిందని కొడాలి నాని ఆరోపించారు. 

40 రోజుల్లో ఢీల్లీ లాయర్లకు  ఏ విధంగా రూ. 35 కోట్లు కట్టారని  కొడాలి నాని  ప్రశ్నించారు. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతో  బస్సు యాత్ర చేస్తున్నారా అని భువనేశ్వరిని కొడాలి నాని  ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెరవెనుక   టీడీపీకి మద్దతుగా నిలిచారని  మాజీ మంత్రి ఆరోపించారు. ఇప్పుడు తన ముసుగును  పవన్ కళ్యాణ్ తొలగించారన్నారు. చంద్రబాబు కోసమే జనసున్నాను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారురని  కొడాలి నాని పేర్కొన్నారు.టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో  నిజం గెలవాలనే పేరుతో నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను  ఇవాళ ప్రారంభించనున్నారు.

also read:నిజమే గెలిస్తే చంద్రబాబు కుటుంబం జైల్లోనే: టీడీపీ, జనసేన మీటింగ్ పై రోజా సెటైర్లు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో  చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన  ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  అప్పటి నుండి  చంద్రబాబు నాయుడు  జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబును  అక్రమంగా అరెస్ట్ చేశారని  టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై  ప్రజలకు వాస్తవాలను వివరించాలని  భువనేశ్వరి నిజం గెలవాలనే పేరుతో  బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios