నిజమే గెలిస్తే చంద్రబాబు కుటుంబం జైల్లోనే: టీడీపీ, జనసేన మీటింగ్ పై రోజా సెటైర్లు


నిన్న జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై  ఏపీ మంత్రి రోజా సెటైర్లు వేశారు.  

AP Minister  RK Roja  Satirical Comments on  TDP Janasena coordination committee meeting lns


తిరుపతి:అరసున్న.... అరసున్న ...కలిసి  జైలులోని గుండు సున్నపై చర్చించారని ఏపీ మంత్రి ఆర్ కే రోజా  టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై సెటైర్లు వేశారు.మంగళవారంనాడు ఏపీ మంత్రి రోజా  తిరుపతి జిల్లాలో మీడియాతో మాట్లాడారు.నిజమే కనుక గెలిస్తే చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి జీవితాంతం  జైల్లోనే ఉంటారన్నారు.

చంద్రబాబు జైలు నుండి వచ్చే పరిస్థితి లేదని ఆమె చెప్పారు.చంద్రబాబు శాశ్వతంగా జైలులో ఉండాలని భువనేశ్వరి పూజలు చేసినట్టున్నారని ఆమె ఎద్దేవా చేశారు.ఇటు ఆరుగురు, అటు ఆరుగురు కూర్చొని సెలక్షన్ చేశారని నిన్న జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై సెటైర్లు చేశారు.నిజం గెలవాలని తాము కోరకుంటున్నామన్నారు.

also read:సున్నా.... సున్నా కలిస్తే సున్నానే:టీడీపీ, జనసేన పొత్తుపై అంబటి సెటైర్లు

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం నిన్న రాజమండ్రిలో జరిగింది. సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  ఆరు కీలక అంశాలపై చర్చించారు. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు.  నవంబర్ 1వ తేదీన ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నారు.  మూడు అంశాలపై తీర్మానం చేశారు.  రానున్న రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై  చర్చించారు.  క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై  కూడ ఈ సమావేశంలో చర్చించారని నేతలు ప్రకటించారు. రెండు పార్టీల మధ్య గ్యాప్ తీసుకు వచ్చేందుకు  వైసీపీ  ప్రయత్నాలు చేస్తున్న అంశంపై  ఈ సమావేశంలో ప్రస్తావించారు  నేతలు .సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం గురించి కూడ చర్చించారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  చంద్రబాబును రాజమండ్రి జైల్లో పరామర్శించి వచ్చిన తర్వాత టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన తర్వాత రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. రెండు పార్టీల నేతల తొలి సమావేశం నిన్నరాజమండ్రిలో జరిగింది.  ఈ సమావేశానికి కొనసాగింపుగా  మరో సమావేశం కూడ నిర్వహించనున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios