కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్: ఏపీ హైకోర్టులో హరిరామజోగయ్య పిటిషన్

కాపులకు  ఈడబ్ల్యుఎస్ కింద  రిజర్వేషన్ ను కేటాయించాలని కోరుతూ  ఏపీ హైకోర్టులో  మాజీ మంత్రి హరిరామజోగయ్య  పిటిషన్ దాఖలు  చేశారు.

Former Minister Harirama Jogaiah files petition for 5 percent reservation to kapu caste

అమరావతి: కాపులకు  ఈడబ్ల్యుఎస్ కింద  5 శాతం రిజర్వేషన్ ను కేటాయించాలని  కోరుతూ  ఏపీ హైకోర్టులో   మాజీ మంత్రి హరిరామజోగయ్య  పిటిషన్ దాఖలు  చేశారు.ఇదే  డిమాండ్ తో  ఇటీవల  హరిరామజోగయ్య  దీక్ష చేసిన విషయం తెలిసిందే . 

కాపులకు  ఈడబ్ల్యుఎస్ కింద  5 శతం రిజర్వేషన్ కల్పించాలని   గత ఏడాది డిసెంబర్ మాసంలో  హరిరామజోగయ్య ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ విషయమై  సానుకూలంగా స్పందించాలని కోరారు. లేకపోతే  ఈ ఏడాది జనవరి  1 నుండి  నిరహరదీక్ష చేస్తానని  ప్రకటించారు. అయితే  ఈ ఏడాది జనవరి  1వ తేదీన  హరిరామజోగయ్య  దీక్షకు దిగాడు. దీక్షను  ప్రారంభించిన  వెంటనే  పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో  కూడా దీక్ష కొనసాగించారు.ఈ విషయం తెలుసుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  హరిరామజోగయ్యకు  ఫోన్  చేశాడు. దీక్షను విరమించాలని కోరారు. ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో  ఉంచుకొని దీక్ష విరమించాలని  కోరారు.దీంతో  హరిరామజోగయ్య  దీక్షను విరమించాడు. 

ఇదే డిమాండ్ తో  ఏపీ హైకోర్టులో  ఆయన  పిటిషన్ దాఖలు  చేశారు.   రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన  ఆదేశాల  మేరకు  ఈడబ్ల్యుఎస్ కింద  కాపులకు  5 శాతం రిజర్వేషన్లు  కల్పించాలని హరిరామజోగయ్య  డిమాండ్  చేస్తున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios