Asianet News TeluguAsianet News Telugu

సీబీఐ చిటికె వేస్తే వైసీపీ ఏమౌతోంది: దేవినేని ఉమ

సీబీఐ చిటికె వేస్తే వైసీపీ ఏమౌతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. 

Former minister Devineni Uma Responds on minister Kodali Nani comments
Author
Amaravati, First Published Nov 17, 2019, 11:46 AM IST


విజయవాడ: సీబీఐ చిటికె వేస్తే  వైసీపీ ఏమౌతోందో చెప్పగలరా  మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆయన ప్రశ్నించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నాడు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వైసీపీ స్టోర్‌రూమ్‌లో పెడతారా, ముందు మీ పార్టీని సరిదిద్దుకోవాలని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Also Read: అయ్యప్ప మాలలో వంశీ తిట్లు.. హిందూ మతంపై జగన్ దాడే: దేవినేని ఉమ

విజయసాయిరెడ్డి లేకుండా ప్రధానమంత్రిని ఎలా కలవకూడదని ఆ పార్టీ ఎంపీలకు తాఖీదులు ఇచ్చారని  దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు.ప్రతి శుక్రవారం నాడు జ్వరమొస్తోంది ఎవరికీ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. జగన్ చిటికె వేస్తే టీడీపీ ఏమౌతోందో అని  మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలపై దేవినేని ఉమ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

సీబీఐ చిటికె వేస్తే  వైసీపీ ఏమౌతోందని జనం ప్రశ్నిస్తున్నారని దేవినేని ఉమ మహేశ్వరరావు చెప్పారు.తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి గుడిని నీ అమ్మ మొగుడు కట్టాడా, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు మీడియా సమావేశంలో మరోసారి చదివి విన్పించారు.

పేద ప్రజలకు సన్న బియ్యం గురించి అడిగితే మేం ఊర కుక్కలమా మాజీ మంత్రి  దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఇసుక కొరత గురించి ప్రశ్నిస్తే  ఈ రకంగా విమర్శలు చేయడం సరైందేనా అని ఆయన చెప్పారు.

Also Read: జూ.ఎన్టీఆర్ ను తేవాలన్నప్పుడు అడిగామా: లోకేష్, బాబులను ఏకేసిన వంశీ

తాము అధికారంలో ఉన్న సమయంలో  వైఎస్ జగన్ చంద్రబాబునాయుడును కాల్చి చంపాలన్నాడు, బంగాళాఖాతంలో వేయాలన్నారు. కానీ, తాము ఆనాడు కూడ ప్రజాస్వామ్యయుతంగానే వైసీపీ విమర్శలకు సమాధానం చెప్పినట్టుగా చెప్పారు. సన్న బియ్యం అడిగితే  మమ్మల్ని నోటికొచ్చినట్టుగా తిడుతున్నారని దేవినేని ఉమ తెలిపారు. 

మంత్రుల భాష ఎలా ఉందో  ఒక్కసారి పరిశీలించుకోవాలని  సీఎం జగన్ కోరారు. తెలుగు భాషను కాపాడాలని కోరితే ఇష్టమొచ్చినట్టుగా  మాట్లాడుతున్నారని దేవినేని ఉమ గుర్తు చేశారు. అమరావతిలో  ఒక్క ఇటుక కూడ కట్టలేదని  విమర్శించిన వైసీపీ నేతలు, మంత్రులు ప్రస్తుతం అమరావతి నుండే పాలన సాగిస్తున్న విషయాన్ని దేవినేని ఉమ గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు లేకుండా చేశారని దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా విమర్శలు చేశారు. తాము అధికారంలో ఉన్న సమయంలో పోలవరం సోమవారంగా చేపట్టి 70 శాతం ప్రాజెక్టును పూర్తి చేసినట్టుగా ఆయన చెప్పారు. 

నవంబర్ 1వ తేదీ నుండి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామని చెప్పిన మంత్రులు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల నిర్మాణం కోసం నిధులు లేకుండా పనులు నిలిచిపోయాయని ఆయన చెప్పారు. 70 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేసిన నవయుగ కంపెనీని పక్కన పెట్టారని ఉమ చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios