విశాఖలో ఉద్రిక్తత:రుషికొండకు వెళ్తున్న మాజీ మంత్రి బండారు అరెస్ట్
విశాఖపట్టణం జిల్లాలోని రుషికొండలో పర్యావరణ మానవ హరంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సహా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేసే సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని Rushikonda లో పర్యావరణ మానవ హారంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి Bandaru Satyanarayanamurthy ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో TDP కార్యకర్తులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. రుషికొండలో తవ్వకాలు జరిగే ప్రాంతానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. .పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వావాదానికి దిగాయి.
రుషికొండ దగ్గర మానవహారానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకిరంచింది పోలీస్ శాఖ. టీడీపీ నేత, ఎమ్మెల్సీ రామారావును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు ముందస్తు అరెస్టులు చేశారు. అయితే పోలీసుల కళ్లుగప్పి రుషికొండకు బయలుదేరిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సహా పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
also read:రుషికొండ రహస్యమేంటీ.. ఎందుకు విపక్షాలను వెళ్లనివ్వడం లేదు: ప్రభుత్వంపై జీవీఎల్ విమర్శలు
విశాఖపట్టణంలోని రుషికొండలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్తగా తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 1వ తేదీన ఉన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ మే 6న ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌జీటీ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈ విషయమై సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ , జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసం విచారణ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు విన్పించారు.
రుషికొండలో ఆరు ఎకరాలు ఉండగా 8.2 ఎకరాల్లోనే నిర్మాణాలున్న విషయాన్ని సింఘ్వి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో రిసార్ట్స్ ఉన్న ప్రాంతంతో పాటు మరింత విస్తరిస్తామన్నారు. రుషికొండ విస్తరణ విషయమై సింఘ్వితో సుప్రీంకోర్టు ధర్మాసనం విబేధించింది. గతంలో రిసార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయాలని ఆదేశించింది.
రుషికొండను తవ్వారని రఘురామకృష్ణంరాజు న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రుషికొండ తాజా ఫోటోలను ఆయన ధర్మాసనం ముందుంచారు. ఇదే విషయమై ఏపీ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉందని కూడా రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది చెప్పారు. నిర్మాణాలకు అనుమతిస్తే పర్యావరణ ముప్పులేకుండా చేపడుతారా ప్రశ్నించింది. అయితే అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపడుతామని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
రుషికొండలో కాలుష్య రహిత వాతావరణం అందించే బాధ్యత అందరిపై ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హైకోర్టు ఎలాంటి నిబంధనలు విధించినా అందరూ కట్టుబడి ఉండాలని సూచించింది. ఎన్జీటీ అవసరమనుకొంటే హైకోర్టు మరో నిపుణుల కమిటీని కూడా నియమించుకోవచ్చని కూడా సూచించింది.తన వాదనలను హైకోర్టులోనే చెప్పాలని రఘురామకృష్ణంరాజుకు సూచించింది సుప్రీంకోర్టు. దీనిపై విచారణను తర్వగా పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు.