పంట కాలువలో పది అడుగుల ఆక్రమణ: అయ్యన్నపాత్రుడి ఇంటిపై ఇరిగేషన్ శాఖ రిపోర్టు
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పంట కాలువను ఆక్రమించి బేస్‌మెంట్ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు తేల్చారు. పంట కాలువ కోసం నిర్మించిన రక్షణ గోడపైనే అయ్యన్నపాత్రుడు బేస్‌మెంట్ నిర్మించారని ఇరిగేషన్ శాఖాధికారులు రిపోర్టు ఇచ్చారని ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ పాత్రుడు స్పష్టం చేశారు.
నర్సీపట్నం: మాజీ మంత్రి Ayyanna patrudu పంట కాలువను ఆక్రమించి బేస్‌మెంట్ నిర్మించారని ఇరిగేషన్ శాఖాధికారులు తేల్చారు. Irrigation అధికారుల వాదనను అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారు. తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని చెబుతున్నారు. కాలువ గట్టున పది అడుగుల వరకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆక్రమించారని తేల్చిన ఇరిగేషన్ శాఖ.
also read:అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతే ఇంటి నిర్మాణం: అయ్యన్న రెండో కొడుకు రాజేష్
Ravanapalli Reservoir సాగు నీటి కాలువకు రక్షణ గోడలు నిర్మించింది ఇరిగేషన్ శాఖ. ఈ రక్షణ గోడలపైనపే బేస్ మెంట్ నిర్మించాడని ఇరిగేషన్ శాఖ తేల్చిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.శివపురం వద్ద నీలంపేట చానెల్ కు ఇరిగేష్ కు నిర్మించిన రక్షణ గోడలు నిర్మించింది ఇరిగేషన్ శాఖ. ఈ రక్షణగోడపైనే బేస్ మెంట్ ను అయ్యన్నపాత్రుడు నిర్మించాడని ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చిందని ఎన్టీవీ చానెల్ కథనం తెలిపింది.
గతంలో ఇరిగేషన్ శాఖ తమ ఇంటి నిర్మాణానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందని అయ్యన్నపాత్రుడి కొడుకు విజయ్ పాత్రుడు చెబుతున్నారు. తమ ఇంటికి అంటించిన నోటీసులో 0.02 సెంట్ల భూమిని ఆక్రమించారని పేర్కొన్నారన్నారు. మీడియాకు మాత్రం రెండు సెంట్ల భూమిని ఆక్రమించారని చెబుతున్నారనన్నారు. తాము ఎలాంటి భూమిని ఆక్రమించలేదని విజయ్ పాత్రుడు మీడియాకు చెప్పారు.
15 రోజుల క్రితం తమకు నోటీసులు ఇచ్చారని అధికారులు చెప్పడాన్ని కూడా విజయ్ పాత్రుడు తప్పు బట్టారు.తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయమై తాము కోర్టుకు వెళ్తే అధికారులు, పోలీసులు బలి పశువులుగా మారడం ఖాయమన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అయ్యన్నపాత్రుడు ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని విజయ్ పాత్రుడు గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి అయ్యన్నపాాత్రుడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో పాటు పలు వేదికలపై విమర్శలు చేస్తున్నారు. దీంతో అయ్యన్నపాత్రుడిని లక్ష్యంగా చేసుకొని జగన్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అయ్యన్నపాత్రుడిపై 12 కేసులు నమోదు చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరో వైపు అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చి వేత విషయాన్ని తెలుసుకొన్న ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయ్యన్నపాత్రుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. వైసీపీకి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చివేత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందో బస్తును ఏర్పాటు చేశారు.మరో వైపు అయ్యన్నపాత్రుడి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు. గోడ కూల్చివేత సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొనకుండా ఉండేందుకే తాము బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటించారు.