Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్రకు ఎవరేమీ చేశారో చర్చకు నేను సిద్దం: వైసీపీకి అయ్యన్న సవాల్

చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్ర సహా విశాఖకు ఏం జరిగిందో, వై.ఎస్ హాయాంలో  ఆ ప్రాంతానికి ఏం ఒరిగిందో ప్రజల మధ్య చర్చకు తాను సిద్ధమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీకి సవాల్ విసిరారు.

former minister Ayyanna Patrudu challenges to ysrcp
Author
Visakhapatnam, First Published Aug 3, 2020, 4:51 PM IST


విశాఖపట్టణం: చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్ర సహా విశాఖకు ఏం జరిగిందో, వై.ఎస్ హాయాంలో  ఆ ప్రాంతానికి ఏం ఒరిగిందో ప్రజల మధ్య చర్చకు తాను సిద్ధమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీకి సవాల్ విసిరారు.

వైసీపీ ప్రభుత్వం నుంచి ఏమంత్రి వస్తాడో రావాలని ఆయన కోరారు. ఒకపక్క జనం చనిపోతుంటే, ముఖ్యమంత్రి మూడుముక్కలాట ఆడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విజయసాయికి తెలియకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

పొరపాటున విశాఖకు రాజధాని వస్తే, ఉత్తరాంధ్ర వాసులు తమ ఆస్తులు, భూములను కాపాడుకోలేక చచ్చిపోతారన్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన అడ్డపంచెల బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు.

కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని మంత్రి మండలి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 

 ముఖ్యమంత్రి కనీసం గంటకూడా ప్రజారోగ్యంపై సమీక్ష చేయడం లేదన్నారు. ఒక పక్క జనం చనిపోతుంటే, ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తూ మూడు ముక్కలాడటం దారుణమన్నారు. ఎన్నికల వేళ ఒక్కటే రాజధాని అని అది అమరావతి అని, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారంచేశారని ఆయన గుర్తు చేశారు. 

ఇప్పుడు ఏవిధంగా విశాఖపట్నం రాజధాని అని చెబుతారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నాయకులు కొందరు జగన్ మెప్పుకోసం తాళం వేస్తున్నారని సంబరాలు చేసుకోవడం నీచాతినీచమన్నారు.

 29వేలరైతు కుటుంబాలు అక్కడ విలపిస్తుం టే, ఇక్కడ సంబరాలు చేయడమేంటన్నారు.  విశాఖలో  కొట్టేసిన 6వేల ఎకరాలను అమ్ముకోవడానికే ఆప్రాంతంలో రాజధాని అని విషప్రచారం చేస్తున్నారన్నారు.  బొత్స, ధర్మాన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హాయాంలో మంత్రులుగా ఉండి ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు. 

వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ విశాఖకు రాకుండా పోయింది బొత్స వల్లేనని, ఉత్తరాంధ్రకు ఆ సమయంలో ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏదో చేస్తారని చెప్పడం సిగ్గుచేటన్నారు. 

దోపిడీ కోసమే విశాఖలో రాజధాని అంటున్నారని, ఇప్పటికే అడ్డపంచెల రౌడీల రౌడీయిజం ఎక్కువైందన్నారు. సమయానికి ఉద్యోగులకు జీతాలు, పింఛన్ దారులకు నెలకు రూ.3వేలు ఇవ్వలేని వాడు మూడు రాజధానులు ఎలా కడతాడో ప్రజలే ఆలోచించాలన్నారు.  

ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశాడంటున్న మంత్రి అవంతితో తాను చర్చకు సిద్ధమని, ఎవరి పాలనలో విశాఖ అభివృద్ది చెందిందో, ఎవరి హాయాంలో విశాఖకు గుర్తింపు వచ్చిందో చర్చించడానికి తాను సిద్ధమని అవంతి అందుకు సిద్ధమేనా అని మాజీ మంత్రి నిలదీశారు.

 వై.ఎస్ హాయాంలో విశాఖలోని హుడాకు చెందిన 3వేల ఎకరాలకు పైగా భూములను అన్యాయంగా అమ్ముకున్నారన్నారు.  జగన్ ప్రభుత్వం వచ్చాక లులూగ్రూప్, ఆదానీ సెంటర్ తరలిపోయాయన్నారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు నాయుడు దగ్గరుండి నగరాన్ని అభివృద్ది చేశారన్నారు. 

also read:పవన్ కల్యాణ్ గురించి మాట్లాడడం వేస్ట్: అనిల్ కుమార్, చంద్రబాబుకు సవాల్

విశాఖకు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకురావడానికి చంద్రబా బు ప్రయత్నిస్తే, భూములివ్వకుండా ఆనాడు అడ్డుకుంది వైసీపీవారేనన్నారు.  ఉత్తరాంధ్రకు ఇన్ ఛార్జ్ అయిన విజయసాయి కి తెలియకుండా మంత్రులు బొత్స గానీ, మరెవరైనా సరే ఏమైనా చేయగలరా అని అయ్యన్న ప్రశ్నించారు. 

విజయసాయికి తెలియకుండా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడని, కలెక్టర్లు ఎవరూ కూడా మంత్రలు, ఎమ్మెల్యేలు చెప్పేది అస్సలు వినడం లేదన్నారు. జిల్లాలో ఉన్న పెద్దపెద్దనాయకులందరూ అయ్యా..అయ్యా అంటూ  విజయసాయి పంచె పట్టుకొని వెనక తిరిగి పరిస్థితి వచ్చిందని ఆయన సెటైర్లు వేశారు.

విశాఖకు రాజధాని వస్తే, నగర వాసులతో పాటు ఉత్తరాంధ్రవాసులు తమ ఆస్తులు, భూములు కాపాడుకోవడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తుందన్నారు. తమ భూములకు కంచెలు వేసుకొని తమ ఆస్తులకు కాపలా కాసుకోవాల్సిన దుస్థితి వస్తుందన్నారు. ప్రజలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తమ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios