Asianet News TeluguAsianet News Telugu

నీళ్లు అమ్ముకొంటున్నారు, జగన్ ఆదేశాలు పట్టించుకోవడం లేదు: ఆనం ఫైర్

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వ్యవహరిస్తున్న  తీరుపై ఆయన మండిపడ్డారు. అధికారులు పద్దతులను మార్చుకోవాలని ఆయన సూచించారు. 
 

former minister anam ramanarayana reddy sensational comments on officers
Author
Nellore, First Published Jun 3, 2020, 3:59 PM IST

నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వ్యవహరిస్తున్న  తీరుపై ఆయన మండిపడ్డారు. అధికారులు పద్దతులను మార్చుకోవాలని ఆయన సూచించారు. 

ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నాడు అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.

former minister anam ramanarayana reddy sensational comments on officers

ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని తాను ఏనాడూ చూడలేదని ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లాలో విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు తయారు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. 

జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకొంటున్నారని ఆయన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎస్ కెనాల్ పరిశీలించారు. సీఎం జగన్ చెప్పినా కూడ అధికారులు వినడం లేదన్నారు.  40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు ఎప్పుడూ చూడలేదన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తనకు ఎమ్మెల్యే పదవి అలంకార ప్రాయం కాదన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి తాను సిద్దమేనని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారుల తీరుపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడ అధికారులు పట్టించుకోకపోవడంపై  ఆయన మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios