కడప: మాజీ మంత్రి అహ్మదుల్లా  ఈ నెల 17వ తేదీన టీడీపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో  అహ్మదుల్లా కడప అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. 

2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీ తరపున కడప నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కూడ ఆయన ఇదే స్థానం నుండి విజయం సాధించారు.  2009లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అహ్మదుల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.

అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో ఈ  స్థానం నుండి వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా విషయం సాధించారు.

అహ్మదుల్లా 1976-82 రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన పీసీసీ అధ్యక్షుడిగా కూడ పనిచేశారు.  అహ్మదుల్లా 2000లో  కడప మున్సిఫల్ ఛైర్మెన్ గా పోటీ చేసి విజయం సాధించారు.

గత ఏడాది నవంబర్ 27వ తేదీన అహ్మదుల్లా తన కొడుకు అష్రఫ్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. వచ్చే ఎన్నికల్లో అహ్మదుల్లా  టీడీపీ అభ్యర్థిగా కడప నుండి పోటీ చేయనున్నారు.రేపు చంద్రబాబునాయుడు సమక్షంలో అహ్మదుల్లా ఆయన తనయుడు ఆష్రఫ్ టీడీపీలో చేరనున్నారు.