చిన్నారులు, మహిళల భద్రతకు కృషి చేశా : వీడ్కోలు సభలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్
ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లో మంగళగిరిలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన పదవీ కాలంలో చిన్నారులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
మంగళగిరి : రెండేళ్ల 8 నెలలు కాలంలో DGPగా చిన్నారులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని Gautam Sawang అన్నారు. మంగళగిరి ఆరో బెటాలియన్ గ్రౌండ్‌లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పోలీసు వ్యవహార శైలిలో మార్పులకు కృషి చేసి.., ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశానని తెలిపారు. డీజీపీగా తనను కొనసాగించిన సీఎం jaganకు సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు.
పోలీసు వ్యవహార శైలిలో మార్పులకు కృషి చేశానని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశానని తెలిపారు. Mangalagiri ఆరో బెటాలియన్ గ్రౌండ్‌లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని.., రెండేళ్ల 8 నెలలు డీజీపీగా కొనసాగించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తాను డీజీపీగా పనిచేసిన సమయంలో చిన్నారులు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సైబర్ మిత్ర, దిశ పోలీసుస్టేషన్‌లు చక్కగా పని చేస్తున్నాయని తెలిపారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపామన్నారు. ఏపీ మొబైల్ సేవా యాప్‌కు విశేష స్పందన వచ్చిందని తెలిపారు.
disha mobile app నుంచి కూడా కేసులు నమోదయ్యేలా చేశాం. బాధితులు స్టేషన్‌కు రాకుండానే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 36 శాతం కేసులు డిజిటల్‌గా వచ్చిన ఫిర్యాదులే. 75 శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్ష విధించాయి. 'స్పందన' ఫిర్యాదుల్లో 40 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు. మహిళలు, చిన్నారుల భద్రతకు స్పందన, ఆపరేషన్ ముస్కాన్ తీసుకొచ్చాం. ఏపీ పోలీసు వ్యవస్థలో డిజిటల్‌గా చాలా మార్పులు తేగలిగాం అని గౌతమ్ సవాంగ్ అన్నారు.
కాగా, ఫిబ్రవరి 17న ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ (Goutam Sawang) నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్‌ను ఫిబ్రవరి 15న ఏపీ సర్కార్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గౌతమ్ సవాంగ్‌కు ఎటువంటి పోస్టింగ్ కేటాయించలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ తరువాత ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్ నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది.
ఇక, 1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2023 జూలై 31 వరకు ఇంకా సర్వీసు ఉండగా ఆకస్మత్తుగా బదిలీ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సీఎం జగన్ ఆదేశాలను గౌతమ్ సవాంగ్ తప్పుకుండా అమలు చేస్తారనే టాక్ కూడా ఉంది.
అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్.. ఆయనను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది.