Ambati Rayudu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పడంపై టీడీపీ రియాక్షన్ ఇదే
వైసీపీకీ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై చెప్పడం పై టీడీపీ రియాక్ట్ అయింది. జగన్ వెంట నడవొద్దని నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం అని పేర్కొంది.
Ambati Rayudu: మాజీ టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా స్పందిస్తూ వచ్చిన ఆయన వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలోకి చేరిన పది రోజుల్లోపే బయటకు వచ్చారు. ఆయన వైసీపీ నుంచి బయటకు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ కూడా ఈ పరిణామంపై స్పందించారు.
టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి అంబటి రాయుడు నిర్ణయంపై స్పందన వచ్చింది. ఒక దుష్టుడైన జగన్ వంటి మనిషి వెంట రాజకీయ ఇన్నింగ్స్ ఆడవద్దనే నిర్ణయం సంతోషకరం అని పేర్కొంది. అంబటి రాయుడు భవిష్యత్ మంచిగా సాగాలని ట్వీట్ చేసింది. వైసీపీ నుంచి బయటికి వస్తున్నట్టు అంబటి రాయుడు కూడా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేసి టీడీపీ రియాక్ట్ అయింది.
Also Read : Praja Palana: నేటితో ముగుస్తున్న ప్రజా పాలన.. దరఖాస్తు చేసుకోని వారు ఏం చేయాలి ?
గతేడాది ఐపీఎల్‌కు అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు. రాజకీయాలపై ఆసక్తితో ఆయన సీఎం జగన్‌కు సానుకూలంగా ట్వీట్లు చేస్తూ వచ్చాడు. అదే క్రమంలో ఆయన సీఎం జగన్ ను కలిశారు. దాదాపుగా ఆయన వైసీపీలో చేరిపోతున్నాడని అప్పుడే తెలిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తృత పర్యటన చేశాడు. స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత వైసీపీలో చేరాడు. అయితే.. గుంటూరు టికెట్ దక్కని నేపథ్యంలో అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు.