ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన‌కు కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేసిన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించారు.

గురువారం ఉదయం విజయవాడ ఎంజీ రోడ్డులోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చిన ఆయన డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్‌కు తిరిగి ఇచ్చేందుకు కావాల్సిన లాంఛనాలు పూర్తి చేశారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పలువురు ఉన్నతాధికారులకు కేంద్ర విదేశాంగ శాఖ డిప్లొమాటిక్ పాస్‌పోర్టును జారీ చేస్తుంది.

తద్వారా వీరు విదేశీ పర్యటనలకు భారత ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరించబడతారు. చంద్రబాబుకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో విదేశాంగ శాఖ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను జారీ చేసింది. 

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడంతో బాబు తనకు ఇచ్చిన పాస్‌పోర్ట్‌ను విదేశాంగ శాఖకు తిరిగి ఇచ్చేశారు.