Asianet News TeluguAsianet News Telugu

ఈ కారణాల వల్లే నిషిత్ మరణించాడట

అపోలో ఆసుపత్రి ఫోరెన్సిక్ డాక్టర్ సురేందర్ రెడ్డి పరీక్షల్లో నిషిత్, రవివర్మ మృతికి 7 ప్రధాన కారణాలు పేర్కొన్నారు.

forensic doctor says there are 7 causes for Nishits death

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతిపై మెడికల్ రిపోర్ట్  విడుదల చేసారు. అపోలో ఆసుపత్రి ఫోరెన్సిక్ డాక్టర్ సురేందర్ రెడ్డి పరీక్షల్లో నిషిత్, రవివర్మ మృతికి 7 ప్రధాన కారణాలు పేర్కొన్నారు. అతివేగంగా పిల్లర్ ను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగిందని డాక్టర్ అభిప్రాయపడ్డారు. దాని వల్లే ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఇద్దరూ చనిపోయి ఉంటారని పేర్కొన్నారు.  అయితే, అందరూ అనుకుంటున్నట్లుగా మృతులు నిశిత్, రవివర్మ మద్యం సేవించలేదని చెప్పారు.

బలంగా దెబ్బలు తగలడంతో ఇద్దరు ఘటన స్ధలంలోనే మృతి చెందారని చెప్పారు.  డ్రైవింగ్ సీట్లో ఉన్న నిశిత్ ఛాతికి స్టీరింగ్ బలంగా తాకిందట. నిశిత్ ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయన్నారు. ప్రమాద తీవ్రత కారణంగా   లంగ్స్ పంక్షర్ అయినట్లు గుర్తించారు. లివర్ కూడా ముక్కలు ముక్కలై పోయాయట. అంతేకాకుండా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం కూడా ప్రధాన కారణమన్నారు. వాహనంలో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నప్పటికీ ప్రమాద తీవ్రత దృష్ట్యా వాటిల్లో ఒక్కటి కూడా తెరుచుకోలేదట.

Follow Us:
Download App:
  • android
  • ios