గుంటూరులో బాల భీముడు.. ఐదు కిలోలున్న నవజాత శిశువు..
గుంటూరు జిల్లా తెనాలిలో బాలభీముడు పుట్టాడు. పుడుతూనే ఐదు కిలోల బరువుతో ఉన్న ఈ చిన్నారి రికార్డ్ క్రియేట్ చేశాడు. వివరాల్లో వెడితే..
గుంటూరు జిల్లా తెనాలిలో బాలభీముడు పుట్టాడు. పుడుతూనే ఐదు కిలోల బరువుతో ఉన్న ఈ చిన్నారి రికార్డ్ క్రియేట్ చేశాడు. వివరాల్లో వెడితే..
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఐదు కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. తెనాలి మండలం నంది వెలుగుకు చెందిన రేష్మ తొలి కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చింది.
డెలివరీ నార్మల్ అవ్వడం కష్టమని, కడుపులో బాబు బరువెక్కువున్నాడని డాక్టర్లు చెప్పారు. దీనికోసం సిజేరియన్ చేసి బాబును బైటికి తీశారు. మామూలుగా నవజాత శిశువులు రెండు నుంచి నాలుగు కిలోల వరకు బరువు ఉంటుంటారు. మూడు కిలోలుంటేనే బలంగా పుట్టారని నమ్ముతారు.
అలాంటిది ఈ చిచ్చర పిడుగు ఏకంగా ఐదు కిలోల బరువున్నాడు. ఇది చాలా అరుదైన విషయమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వారు తెలిపారు.