Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్టణంలో డ్రగ్స్ కలకలం: ఐదుగురు అరెస్ట్

విశాఖపట్టణంలోని  ఫోర్త్ టౌన్ పరిధిలో డ్రగ్ప్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Five held for selling Drugs In Visakhapatnam
Author
Visakhapatnam, First Published Aug 7, 2022, 2:44 PM IST

విశాఖపట్టణం: visakhapatnam లో Drugsను ఆదివారం నాడు పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి విశాఖ పోలీసులు  ఆదివారం నాడు విశాకపట్టణం సీపీ శ్రీకాంత్  మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. Goa నుండి డ్రగ్స్ ను తీసుకొచ్చినట్టుగా పోలీసులు తెలిపారు.

రవికుమార్,వాసు దేవా కాటయ్య,మోజేష్, యాడ కిషోర్,, మర్రే సందీప్ లను అరెస్ట్ చేసినట్టుగా సీపీ శ్రీకాంత్ వివరించారు  నిందితుల నుండి  50 ఎల్ ఎస్ డి బ్లాట్స్..4.4 గ్రాముల ఎండిఎంఎ పౌడర్ ను సీజ్ చేశామన్నారు. అంతేకాదు నిందితులు ఉపయోగించిన .5 సెల్ పోన్లు, .ఓ కారు స్వాదినం చేసుకున్నామని సీపీ తెలిపారు. 6వ నిందితుడు దీలిప్ అనే వ్యక్తి ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. గతంలో హోలి పండుగ సమయంలో రవికుమార్ డ్రగ్స్  తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు.  ఇవాళ ప్రెండ్ షిప్ డే కావడంతో మళ్లీ  గోవా నుండి  డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ శ్రీకాంత్ చెప్పారు. 

గతంలో యాంటినార్కోటిక్ సెల్ ద్వారా హైద్రాబాద్ లో గచ్చిబౌలి త్రీబుల్ ఐటి చదువుతున్న నలుగురు విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ అమ్ముతున్న,  అలవాటు ఉన్న వారిపై  నిఘా ఏర్పాటు చేసినట్టుగా సీపీ తెలిపారు. డార్క్ నెట్ ను డ్రగ్స్ కోసం ఉపయోగించారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయమై తమ దర్యాప్తులో గుర్తించామన్నారు. గోవా నుంండి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న దిలీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు దిలీప్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

విశాఖపట్టణంలో రవికుమార్ సహా మరో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. డార్క్ వెబ్ లో క్రిఫ్టో కరెన్సీని ఉపయోగించి డ్రగ్స్ కొనుగోలు చేశారని తమ దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు వివరించారు. రిటైల్ గా మాత్రం యూపీఐ ద్వారా డ్రగ్స్ ను విక్రయిస్తున్నారని గుర్తంచామని పోలీసులు ప్రకటించారు. ఇన్ స్టా గ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ కోసం ఆర్డర్స్ తీసుకుంటున్నట్టుగా తాము గుర్తించామని పోలీసులు వివరించారు.

డ్రగ్స్ కొనుగోలు చేసిన వారికి కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించామన్నారు.విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని ఈ మత్తుపదార్దాలు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు వివరించారు. తొలుత గంజాయిని అలవాటుకు పడిన వారు మత్తు సరిపోకపోవడంతో సింథటిక్ డ్రగ్స్  వైపునకు వెళ్తున్నారని తాము గుర్తించామని పోలీసులు వివరించారు. 

ఈ కేసులో ఏ 1 గా రవికుమార్ ఉన్నాడని సీపీ వివరించారు. రవికుమార్ గంజాయి ని తీసుకెళ్లి గోవాలో ఉన్న దిలీప్ కు ఇచ్చేవాడని సీపీ తెలిపారు. దీనికి బదులుగా రవికుమార్ దిలీప్ కు డ్రగ్స్ ఇచ్చేవాడని ఆయన సీపీ వివరించారు. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా కూడా నిందితులు డ్రగ్స్ విక్రయించారప్పారు.ఈ ఏడాది ఏప్రిల్  మాసంలో ఎండీఎంఏ ను స్పటిక రూపంలో సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 54 గ్రామలు డ్రగ్స్ ను సీజ్ చేశారు. బెంగుళూరు నుండి నిందితులు ఈ డ్రగ్స్ ను తీసుకొచ్చారని పోలీసులు గుర్తించారు. విశాఖపట్టణంలో ఇటీవల కాలంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్న కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. డ్రగ్స్ సరఫరా  చేసే వారిపై నిఘాను పెంచింది.  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరాలో విశాఖ ఏజెన్సీ పేరు వస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios