కడప: టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ అన్భు రాజన్ చెప్పారు.గురువారం నాడు ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు. సుబ్బయ్య హత్య కేసును పారదర్శకంగా విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఏ1 నిందితుడికి హతుడికి మధ్య పాత కక్షలున్నాయన్నారు. ఆరేళ్లనాటి విషయమై ఘర్షణపడినట్టుగా చెప్పారు.ఈ ఘర్షణ తర్వాత నందం సుబ్బయ్యను హత్య చేశారన్నారు. ఈ కేసులో ఏ 1 నిందితుడు కుంబా రవితో పాటు  నలుగురిని ప్రొద్దుటూరు పోలీసులు బుధవారంనాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

also read:టీడీపీ నేత నందం సుబ్బయ్య అంతిమయాత్ర: పాల్గొన్న లోకేష్

సుబ్బయ్య హత్య కేసులో  ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన బావ మరిది పేర్లను కూడా చేర్చాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు  ఆ పార్టీ నేతలు బుధవారం నాడు సాయత్రం  ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా తర్వాత సుబ్బయ్య హత్య కేసులో  ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది పేర్లను పోలీసులు చేర్చారు.