Fishing Harbour Fire : నేను ఏ తప్పూ చేయలేదు.. సాయం అందుతుందనే వీడియో పెట్టాను - లోకల్ బాయ్ నాని
తాను ఏ తప్పూ చేయలేదని, వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదానికి ( Vizag Fishing Harbour Fire Accident), తనకు ఏ సంబంధమూ లేదని యూట్యూబర్ లోకల్ బాయ్ నాని (youtuber local boy nani) అన్నారు. కావాలనే తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించారు.
వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదానికి తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. సాయం అందుతుందనే ఉద్దేశంతోనే తాను వీడియో తీసి అప్ లోడ్ చేశానని అన్నారు. గంగ పుత్రులు నిజా నిజాలు తెలుసుకోవాలని కోరారు.
విషాదం.. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి.. మరొకరికి గాయాలు..
ఈ అగ్నిప్రమాదం ఘటన చోటు చేసుకున్న నవంబర్ 19వ తేదీ రాత్రి తాను వేరే ప్రదేశంలో ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చానని అన్నారు. ప్రమాదం జరిగిందని తనకు 9:46 నిమిషాలకు ఫోన్ రావడంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్లానని చెప్పారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని అన్నారు. తాను పార్టీలో మద్యం సేవించి ఉన్నానని అన్నారు.
గంగ పుత్రులకు సహాయం అందుతుందనే ఉద్దేశంతోనే వీడియో తీసి పెట్టానని అన్నారు. తనకు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వీడియో తీయలేదని చెప్పారు. తాను రికార్డు చేసిన వీడియో రాత్రి 10 గంటలకు అప్ లోడ్ చేశానని తెలిపారు. అయితే క్రైమ్ పోలీసులు తనకు ఫోన్ చేసి, చిన్న విచారణ అని పిలిచారని అన్నారు. అక్కడికి వెళ్లిన తరువాత తన దగ్గర ఉన్నవన్నీ తీసుకున్నారని ఆరోపించారు. బోట్లు తానే తగలపెట్టానని ఆరోపిస్తూ కొట్టారని చెప్పారు.
cricket world cup 2023 : వరల్డ్ కప్ ఫైనల్.. అలా చేసి ఉంటే భారత్ కచ్చితంగా గెలిచేది - మమతా బెనర్జీ
ప్రమాదం జరిగిన సమయంలో తాను ఎక్కడ ఉన్నాననేది సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, ఇవ్వన్నీ చూసిన తరువాత కూడా ఫ్రెండ్స్ తో కలిసి తానే తప్పు చేశానని పోలీసులు అంటున్నారని నాని ఆరోపించారు. తనతో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తాను హైకోర్టులో పిటిషన్ వేయగానే బెదిరించారని ఆరోపించారు.
ఖతార్ లో 8 మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష.. భారత్ అప్పీల్ ను స్వీకరించిన ఆ దేశ కోర్టు
హైకోర్టులో తనకు న్యాయం జరుగుతుందని నాని ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ వెళ్ళాక తనపై దాడి జరగవచ్చని, ఇప్పటికే తన సోదరుడిని రాళ్లతో కొట్టారని అన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గంగ పుత్రులు వాస్తవాలు తెలుసుకోవాలని అభ్యర్థించారు.