Fire at Vizag fishing harbour : వైఎస్ జగన్ రావాలి, న్యాయం చేయాలి. బాధిత కుటుంబాల ఆందోళణ

విశాఖ ఫిషింగ్ హార్బర్ గేటు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్నిప్రమాద బాధిత కుటుంబాలు గేటు దగ్గర బైఠాయించి, ఆందోళన చేపట్టారు. 

Fishing harbor fire : Fishing families demanding for YS Jagan should come, and do justice to them - bsb

విశాఖపట్నం : విశాఖపట్నం అగ్నిప్రమాద ఘటన మీద బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం కావాలంటూ కోరుతున్నాయి. హార్బర్ గేటు దగ్గర మత్స్యకార కుటుంబాలు బైఠాయించాయి. సీఎం వైఎస్ జగన్ ఘటనా స్థలాన్ని సందర్శించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

నిన్న అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోట్లకు సంబంధించి తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్  చేస్తున్నారు.  50 లక్షల పరిహారం ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తేల్చి చెప్పారు. విశాఖ జేపీ విశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్ని పరిశీలించారు. 

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. యూట్యూబర్ పై కేసు నమోదు !

ఆయన మాట్లాడుతూ...బాలాజీకి యూట్యూబర్ కి ఒకటో నెం. జట్టీలో గొడవ జరిగింది. బాలాజీకి యూబ్యూబర్ బోటు అమ్మాడు. ఆ సమయంలో డబ్బుల విషయంలో ఏదో గొడవ జరగడంతో కావాలనే బోటుకు మంట పెట్టారని సమాచారం. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. కోట్లలో నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. 45 బోట్లు వందశాతం దగ్థమై పోయాయి. మరికొన్ని బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి.. అని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios