Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. కంటైనర్ టెర్మినల్ దిగ్భంధించేందుకు మత్స్యకారుల యత్నం..

విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంటైనర్ టెర్మినల్ దిగ్భంధించేందుకు మత్స్యకారులు యత్నించారు. 

fishermen protest at visakha fishing harbour
Author
First Published Sep 24, 2022, 9:58 AM IST

విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంటైనర్ టెర్మినల్ దిగ్భంధించేందుకు మత్స్యకారులు యత్నించారు. షిప్‌లు వచ్చే మార్గంలో బోట్లను అడ్డుగాపెట్టి నిరసన వ్యక్తం చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేటు వద్దకు మత్య్సకారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పోర్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇక, కొద్దిరోజుల క్రితం కూడా మత్స్యకారులు నిరసన చేపట్టారు. విశాఖపట్నం పోర్టు నిర్మాణంలో ఉన్న క్రూయిజ్‌ టెర్మినల్‌లో స్థానిక మత్స్యకారులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులు పోర్టు వద్ద నిరసన చేపట్టారు. జనరల్ కార్గో బెర్త్ ప్రధాన ద్వారం ముందు జాలర్లు బైఠాయించి.. ఓడరేవు లోపలికికి వెలుపలకు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

తమ పూర్వీకులు 1933లో ఓడరేవు నిర్మాణానికి భూమి ఇచ్చారని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్‌కు వినతి పత్రంలో మత్స్యకార సంఘం నాయకులు గుర్తు చేశారు. సంఘం నాయకులు మాట్లాడుతూ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని, పోర్టుకు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. ఓడరేవులో నిర్మాణంలో ఉన్న క్రూయిజ్ టెర్మినల్‌లో స్థానిక మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios