Asianet News TeluguAsianet News Telugu

రింగు వలల వివాదం.. మరోసారి భగ్గుమన్న విశాఖ, రోడ్డుపైకి వేలాది మంది మత్స్యకారులు

రింగు వలల వివాదంతో విశాఖ నగరంలో (visakhapatnam) మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపైకి వేల సంఖ్యలో గ్రామస్తులు వచ్చి... రోడ్డుపై బైఠాయించారు. 

fishermen dispute about ring nets in visakha harbour
Author
Visakhapatnam, First Published Jan 5, 2022, 5:03 PM IST

రింగు వలల వివాదంతో విశాఖ నగరంలో (visakhapatnam) మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపైకి వేల సంఖ్యలో గ్రామస్తులు వచ్చి... రోడ్డుపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలు బాయ్‌కాట్ చేస్తున్నామని మత్స్యకార నేతలు స్పష్టం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టే వరకు చర్చలకు వెళ్లేది లేదని మత్స్యకార నేతలు పేర్కొన్నారు.

ఇది వివాదం: 

కాగా.. విశాఖ హార్బర్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు అన్ని మత్స్యకార గ్రామాల గంగపుత్రులు.. రింగు వలలతో చేపల వేట సాగిస్తున్నారు.  దీంతో సాంప్రదాయ మత్స్యకారులు రింగు వలలను నిషేధించాల్సిందిగా కొన్ని నెలలుగా నిరసనలు చేశారు. దీనిపై అధికారులతో చర్చలు జరిపినా.. ఫలితం లేకపోవడంతో కొందరు రింగు వలల మత్స్యకారులు హైకోర్టు మెట్లెక్కారు. 13 బోట్లకు మాత్రమే రింగు వలలతో సముద్ర తీరానికి అనుమతిచ్చిన కోర్టు.. ఎనిమిది కిలోమీటర్ల అవతల వేట చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రింగు వలల మత్స్యకారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తీరానికి సమీపంలో వేట చేయటం వలన మత్స్య సంపద నాశనమైపోతోందని సాంప్రదాయ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

ALso Read:విశాఖలో రింగ్ వలల వివాదం: రెండు గ్రామాల మత్య్సకారుల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

వారం రోజులుగా జాలరిఎండాడ జాలర్లు రింగు వలలతో చేపల వేట సాగిస్తున్నారు. చేపలు కూడా ఎక్కువుగా లభ్యమవుతుండడంతో సంతోషంగా సాగిపోతున్న తరుణంలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం మరోసారి చోటు చేసుకుంది. రింగు వలలతో మత్స్యకారులు వేటకు వెళ్లడంతో.. సాంప్రదాయ మత్స్యకారులు వారిని అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. దీంతో.. సముద్రంలోని బోట్లకు సాంప్రదాయ మత్స్యకారులు నిప్పంటించారు.

ఈ ఘటనలో ఏడు బోట్లు కాలిపోగా.. నలుగురు జాలర్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వాసవానిపాలెం తీరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. దీనితో పాటు వాసవానిపాలెం, జాలరి పేటలలో 144 సెక్షన్ అమలు చేశారు. మత్స్యకారులు పోలీసులకు సహాకరించాలని విశాఖ నగర పోలీస్ కమీషనర్ మనీష కుమార్ సిన్హా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios