విశాఖపట్టణం జిల్లాలోని రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.రింగ్ వలలతో కాకుండా సంప్రదాయ పద్దతుల్లోనే చేపల వేట చేయాలని కొంత కాలంగా ఈ ప్రాంతంలో మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. రింగ్ వలలతో చేపల వేట వద్దని కోరుతున్నారు. 


విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని peda jalaripeta లో సోమవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. Gangamma Thalli gudi , గంగమ్మతల్లిగుడి fishermen మధ్య మంగళవారం నాడు ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల ఘర్షణలో సముద్రంలో ఓ బోటుకు నిప్పు పెట్టారు. రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణలో పెద్దజాలరి పేటకు చెందిన నలుగురు మత్స్యకారులకు గాయాలయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రింగ్ వలలతో Fish వేట చేయకూడదని సంప్రదాయ వలలతో చేపలను వేటాడే మత్స్యకారులు కోరుతున్నారు.ఇదే విషయమై రింగ్ వలలతో చేపల వేటాడే వారితో సంప్రదాయపద్దతిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు గొడవకు దిగుతున్నారు. ఇదే విషయమై ఇవాళ ఈ రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. రింగ్ వలలను నిషేధించాలని సంప్రదాయ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున మంగమూరిపేట తీరం వద్దకు చేరుకొన్నారు.దాదాపుగా 50 రోజులుగా సంప్రదాయ చేపల వేటకు వెళ్లే తమకు చేపలు దొరకడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. రింగ్ వలలను నిషేధించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.