విశాఖపట్టణం:  విశాఖ జిల్లాలోని విశాఖ దక్షిణ అసెంబ్లి నియోజకవర్గానికి చెందిన ఫలితం మొదటగా వెలువడనుంది.  ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి ఫలితం వెల్లడి కానుంది.

విశాఖ జిల్లాలో మూడు పార్లమెంట్, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యల్పంగా 17 రౌండ్లు, అత్యధికంగా 23 రౌండ్ల వరకు ఉన్నాయి.పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాన్ని వెల్లడించనున్నారు.

విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో 236 పోలింగ్ బూత్‌లున్నాయి. ఈ నియోజకవర్గంలో 2,09,186 ఓటర్లకు గాను 1,27,909 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. రౌండ్‌కు 14 ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. విశాఖ దక్షిణ ఫలితం తరువాత విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 237 పోలింగ్ బూత్‌లున్నాయి. కానీ, ఈ నియోజకవర్గంలో 1,37,499 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గం తర్వాత పాడేరు, అరకు, మాడ్గుల, అనకాపల్లి, యలమంచిలి , విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి