కర్నూలు విమానాశ్రయంలో ఆదివారం చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది.  ఈ ఎయిర్‌పోర్ట్‌లో తొలి ప్యాసింజర్ ఫ్లైట్స్ (ఇండిగో)  బెంగళూరు-కర్నూలు; కర్నూలు-విశాఖపట్నంల మధ్య నడిచాయి. ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండాను ప్రారంభించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. 

బెంగళూరు-కర్నూలు మధ్య నడిచిన తొలి ప్యాసెంజర్ ఫ్లైట్ (ఇండిగో 6E7911) ను నడిపిన పైలట్  కర్నూలు వాసి వీరా కావడం విశేషం. తొలి ప్యాసింజర్స్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బెంగళూరు నాగరబావి నివాసి రాంప్రసాద్ దంపతులు, సాయి ప్రతీక్షలకు పూల మొక్కలను ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు మంత్రులు, అధికారులు. 

అలాగే కర్నూలు విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలు దేరిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్ (ఇండిగో 6E 7912)‌ను జాతీయ జెండా ఊపి ప్రారంభించారు మంత్రులు. ఈ సందర్భంగా ప్యాసింజర్స్ కు స్వీట్స్ ప్యాకేట్స్ ను బహుకరించి .. హ్యాపీ జర్నీ చెప్పారు.

ఈ రెండు కార్యక్రమాలతో ఎయిర్‌పోర్ట్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.  తొలి ప్యాసెంజర్ ఫ్లైట్స్ లో బెంగళూరు నుండి కర్నూలు ఎయిర్ పోర్ట్ కు రావడం.. కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విశాఖపట్నం బయలుదేరి వెళ్లడం తమ జీవితాల్లో ఎన్నటికీ మరిచిపోలేని మధురానుభూతిని మిగిల్చింది.