Visakhapatnam fire accident : విశాఖపట్నంలో అగ్నిప్రమాదం.. షిప్పింగ్ కంపెనీ గోదాంలో చెలరేగిన మంటలు
విశాఖపట్నంలో ఉన్న పిష్షింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క సారిగా మంటలు చెలరేగిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు అయ్యాయి.
విశాఖపట్నంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలో ఉన్న ఓ పిష్షింగ్ కంపెనీ గోదాంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అవి తీవ్రంగా వ్యాప్తి చెందాయి. ఈ భారీ అగ్నిప్రమాదం విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఈ అగ్నిప్రమాదం ఘటనలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. వారికి ప్రస్తుతం అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాము తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.