లీకేజ్, వరదలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అగ్నిప్రమాదం భయాందోళనల్లో ముంచేసింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

అయితే వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.