ఏపీలోని అనంతపురం జిల్లా పామిడిలోని ఎస్‌బీఐ ఏటీఎం గదిలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై పక్క దుకాణాలకు, నివాసాలకు విస్తరించకుండా అదుపు చేసే యత్నం చేశారు.

అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్ మంటలను పూర్తిగా ఆర్పివేసింది. అప్పటికే ఆ గదిలోని 2 ఏటీఎంలు, ఓ నగదుజమ యంత్రం, 2 కోడింగ్‌ యంత్రాలు, 2 ఏసీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

అలాగే ఏటీఏంలలోని రూ.32 లక్షలూ బూడిదైనట్లు ఎస్‌బీఐ మేనేజరు తెలిపారు. ప్రమాదం కారణంగా రూ.44 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.