గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐసీయూ వార్డులో వున్న రోగులను సిబ్బంది మరో వార్డుకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.