ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాప సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. చిన వెంకన్న ఆలయంలోని ధర్మ అప్పారాయ నిలయం దగ్గర షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. రూమ్ నెంబర్ 48లో ఏసీ నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
