ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగాయి.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

బ్యాంకులో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో.. ఫర్నిచర్, ఇతర సామాగ్రి ధ్వంసమైంది. అయితే డబ్బులు, పత్రాలు భద్రపరిచే లాకర్ సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
