వరుస ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న విశాఖ నగరంలో శనివారం మరో ఘటన జరిగింది. నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ చేపల బోటు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో బోటు  కాలిపోయింది.

ప్రమాదాన్ని గమనించిన మత్య్సకారులు అప్రమత్తమయ్యారు. పోర్ట్ ట్రస్ట్‌కు సమాచారం అందించారు. దీంతో పోర్ట్ అధికారులు మంటలను ఆర్పేందుకు సిబ్బందిని పంపారు. అంతేకాకుండా ప్రమాదంలో దగ్థమైన బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రమాదాన్ని చూసిన స్థానిక యువకులు.. మత్స్యకారులను రక్షించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.