విజయవాడ: కరోనా వైరస్ చికిత్స కోసం కేటాయించిన హాస్పిటల్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలో రమేష్ హాస్పిటల్ కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు స్వర్ణా ప్యాలెస్ ను ఉపయోగిస్తోంది. ఇదే బిల్డింగ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. 

తెల్లవారుజామున ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో హాస్పిటల్ లో 40మంది కరోనా పేషంట్స్ తో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది వున్నట్లు సమాచారం. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు బిల్డింగ్ లో వున్నవారిని ఉక్కిరిబిక్కిరి  చేశాయి. దీంతో వారు కిటీకీల వద్దకు చేరుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు.  

వీడియో

 ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాస్పిటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ప్రమాదంలో మరింత అస్వస్ధతకు గురయిన పేషెంట్స్ ఇతర కోవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ  అగ్నిప్రమాదం చోటుచేసుకుని వుంటుందని... మంటలను ఎవ్వరూ గమనించకపోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.