Asianet News TeluguAsianet News Telugu

పొత్తుల విష‌యంలో తుది నిర్ణ‌యం చంద్ర‌బాబుదే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై టీడీపీ పొలిట్ బ్యూరో చ‌ర్చ

Amaravati: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు.
 

final decision on alliances will be taken by Chandrababu Naidu, TDP politburo discusses upcoming elections RMA
Author
First Published Mar 29, 2023, 9:58 AM IST

TDP national president N Chandrababu Naidu: వచ్చే ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న ఆశలను సజీవంగా ఉంచిన టీడీపీ పొలిట్ బ్యూరో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అప్పగించింది. ప్రజలు, పార్టీలు, రాజకీయాల మనుగడకు ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా కీలకమని ఆ పార్టీ భావించిందని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రానున్న ఎన్నిక‌ల‌పై దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ అత్యున్నత స్థాయి పొలిట్ బ్యూరో మంగళవారం హైదరాబాద్ లో సమావేశమైంది. గత ఏడేళ్లలో హైదరాబాద్ లో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఏపీకి సంబంధించి 13, తెలంగాణకు సంబంధించి 4 సహా మొత్తం 17 అంశాలపై చర్చించారు.

"తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు" అని పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం పార్టీ ఏపీ అధ్యక్షుడు కే.అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రక్రియలో భావసారూప్యత కలిగిన పార్టీలతో చేతులు కలిపేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. 

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్మారక నాణెం రూ.100 విడుదల చేయాలని నిర్ణయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలపాలని టీడీపీ నిర్ణయించిందని వెల్ల‌డించారు. మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో మహానాడు ఘనంగా నిర్వహించాలని పొలిట్‌ బ్యూరో నిర్ణయించింద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్ శతజయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించిందని స‌మాచారం.

 

Follow Us:
Download App:
  • android
  • ios