Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం: ఏపీ సర్కార్‌పై రాఘవేంద్రరావు ఫైర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఖండించారు.

Film Director Raghavendra Rao Condemn Chandrababu Naidu Arrest and slams YSRCP Govt ksm
Author
First Published Sep 9, 2023, 1:33 PM IST | Last Updated Sep 9, 2023, 1:33 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఖండించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని విమర్శించారు. ఒక విజనరీ లీడర్ అయినటువంటి 
చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. 

‘‘ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి’’ అని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఈ మేరకు రాఘవేంద్రరావు ఎక్స్ (ట్విట్టర్‌)లో ఓ పోస్టు చేశారు. 

ఇక, నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లు డీఐజీ రఘురామిరెడ్డి తెలిపారు. అయితే ఈ పరిణామాలపై టీడీపీ  శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పలువురు రాష్ట్రంలోని టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios