వినాయక విగ్రహం కోసం కొట్లాట.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు
Sri Sathya Sai district: వినాయక చవితి నవరాత్రులలో 9 రోజులు పాటు వినాకుడిని విగ్రహాలను నిలబెట్టి.. దుర్గా నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఎలా పూజిస్తారో, వినాయక చవితి నవరాత్రులలో కూడా తొమ్మిది రకాల వినాయకుడిని పూజిస్తారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే, వినాయక నవరాత్రుల నేపథ్యంలో గణేషుని విగ్రహం విషయంలో ఘర్షణ చోటుచేసుకుని ఒకరి ప్రాణాలు కోల్పోవడవంతో పాటు మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Ganesh Chaturthi Navaratri: వినాయక చవితి నవరాత్రులలో 9 రోజులు పాటు వినాకుడిని విగ్రహాలను నిలబెట్టి.. దుర్గా నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఎలా పూజిస్తారో, వినాయక చవితి నవరాత్రులలో కూడా తొమ్మిది రకాల వినాయకుడిని పూజిస్తారని గణేశ పురాణం, ముద్గల పురాణం, మత్స్య పురాణాల్లో చెప్పబడింది. అయితే, వినాయక నవరాత్రుల నేపథ్యంలో గణేషుని విగ్రహం విషయంలో ఘర్షణ చోటుచేసుకుని ఒకరి ప్రాణాలు కోల్పోవడవంతో పాటు మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుడి విగ్రహాలను నిలబెట్టి.. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరువాడ వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ అపశృతి చోటుచేసుకుంది. వినాయకుని విగ్రహం విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ హింసలో ఒకరు ప్రాణలు కోల్పోగా మరో 10 మంది గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం దొరగిల్లులో బీసీ క్వాటర్స్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం విషయంలో రెండు వర్గాలకు చెందిన యువకులు గొడవ పడ్డారు. మాటలతో మొదలైన ఈ గొడవ తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారింది. ఇది కాస్త గ్రామంలోని రెండు వర్గాలకు మధ్య గొడవగా మారింది. దీంతో గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో అనంతయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, 10 మంది తీవ్ర గాయాలు, చాలామందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగడంతో ఆందోళనలో పలువురు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న పోలీసులు గొడవను నిలువరించారు. మృతుడు అనంతయ్య మృతదేహన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని సమాచారం. హత్య, ఘర్షణపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు రెండు వర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామనీ, త్వరలోనే మరిన్ని పూర్తి వివరాలు వెల్లడిస్తామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.