వివాహ నిశ్చితార్థం వేడుకలో విషాదం చోటు చేసుకుంది. చిన్న లడ్డూ కోసం జరిగిన పెళ్లికూతురి అన్నయ్య మరణించాడు.. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం ఎదురుపాడుకు చెందిన మరియమ్మ, ఏసన్న దంపతుల కుమార్తెకు పాములపాడు మండలం మిట్టకందాలకు చెందిన దిబ్బన్న కుమారుడు ప్రశాంత్‌తో సోమవారం రాత్రి నందికొట్కూరులో వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రాత్రి 12 గంటలకు భోజనాలు వడ్డిస్తున్న సమయంలో తమకు అదనంగా లడ్డూ ఇవ్వాలని కొందరు తాగుబోతులు గొడవకు దిగారు. ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో పెళ్లికూతురు సొంత అన్నయ్య రాజు వారికి సర్దిచెప్పేందుకు వెళ్లాడు.

ఈ సమయంలో చెన్నయ్య, ఆంజనేయులు, సుజాత అనే వారితో పాటు కొందరు దాడి చేయడంతో రాజుకు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. దీంతో శుభకార్యంలో విషాద వాతావరణం చోటుచేసుకుంది. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.