2017 జనవరి రు. 149 కే టివి, ఇంటర్నెట్,టెలిపోన్ సౌకర్యం
నెలకు 149రూపాయలకే ప్రజలకు టీవీ ప్రసారాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు టెలిఫోన్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజక్టు ఆంధ్రప్రదేశ్ లో తుదిదశకు చేరుకుంది. . జనవరి నాటికి ఫైబర్ గ్రిడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకితీసుకురావాలని కృషి జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇపుడు ప్రతికుటుంబం సగటున ఈ మూడు సేవలకు రు. 2వేల దాకా చెల్లించాల్సివస్తున్నది,.
ఈ సేవల కోసం ఇప్పటికే కొన్ని టెలికాం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. లక్ష సీపీఈ బాక్సులు సిద్ధం చేసింది. ఇంకా మరో10లక్షల బాక్సులను కోనుగోలు చేస్తారు. దక్షిణ కొరియా, చైనాల నుంచి సెట్ టాప్ బాక్సులను తెప్పిస్తున్నారు.
40 లక్షల ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ సేవలు...
రానున్న రెండేళ్లల్లో 40 లక్షల ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ టీవీ, ఉచిత టెలిఫోన్, ఇంటర్ నెట్ కనెక్షన్ 10 ఎంబీపీఎస్ అందజేయనున్నారు. ఇందుకు కేవలం వినియోగదారుల నుంచి 149 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. ప్రైవేట్ సంస్థలు ఇష్టాను సారం కేబుల్ లైన్లు వేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫైబర్ గ్రిడ్ లైన్ నుంచే కనెషన్లు తీసుకోనేలా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకుంటోంది. ఛానళ్ల ప్రసారాలే కాకుండా ఫైబర్ గ్రిడ్ అందిస్తున్న యాప్ ద్వారా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలపై లఘు చిత్రాల ప్రదర్శన అపుడు అందుబాటులోకి వస్తాయి. అలా ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే వీలు కలుగుతోంది.
ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తీసుకున్న వారందినీ ఒక బృందంగా (గ్రూప్) పరిగణిస్తారు. ఈ బృందం సభ్యులు ఒకరితో మరొకరు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎవరితోనైనా ఎంత సేపైనా ఇంటర్ కమ్ తరహాలో మాట్లాడుకునే అవకాశం ఉంటోంది. ఇతర టెలిఫోన్ ఆపరేటర్ల తరహాలోనే ఏపీ ఫైబర్ గ్రిడ్ కూ సహకరించాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను కోరారు .
గ్రిడ్ సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకొనేందుకు తూర్పుగోదావరి జిల్లాలో,విశాఖలో కొన్ని ప్రాంతాలకు గ్రిడ్ సేవలను ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రసారాల్లో 220 ఛానళ్ల వరకూ వస్తున్నాయి. హిందీ, ఇంగ్లీష్ తో పాటు స్పోర్టు ఛానళ్లనూ ప్రసారం చేయనున్నారు. ప్రజలనుంచి మంచి స్పందన రావడంతో గ్రిడ్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు అధికారులు నిమగ్న మయ్యారు.వచ్చే జనవరి నాటికి రాష్ర్ట వ్యాప్తంగా ఈ సేవలను అందించేలా చర్యలు చేపట్టారు.
సులభ వాయిదాల్లో సెట్ టాప్ బాక్స్ లు...
రౌటర్ తో సహ ఇంటర్ నెట్, ఐపీ టీవీ , టెలిఫోన్ సేవలందించేందుకు ప్రతి వినియోగ దారునికి నాలుగు వేల రూపాయలు విలువైన రెండు బాక్సులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు బాక్సులను ఒకే బాక్సుగా వ్వవహరిస్తారు. ఈ రెండింటినీ ఒకేసారి కొనుగోలు చేసుకోవొచ్చు. లేకుంటే సులభ వాయిదాల్లో చెల్లించొచ్చు. ఇందుకు కోసం అధికారులు మూడు రకాల నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిది నాలుగు వేలు ఒకేసారి చెల్లించవచ్చు. ఇక రెండవది, ముందుగా రూ.1700 చెల్లించి, తరవాత ప్రతి నెలా 99 రూపాయలు చెల్లించొచ్చు. తొలుత 500 చెల్లించి ప్రతి నెల 99 రూపాయలు చెల్లించడం మూడవ పద్ధతి. నాలుగు వేల రూపాయలు జమయ్యే వరకూ 99 రూపాయలు కట్టవలసి వస్తుంది.వీటిల్లో వినియోగ దారునికి అనుకూలతను బట్టి ఏదైనా తీసుకోవచ్చు. అద్దె ఇంట్లో ఉన్నవారికి కూడా ఎంతో ఇది సదుపాయం. తాము ఇల్లు మారేటప్పుడు కూడా ఈ సెట్ టాప్ బాక్సులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తీసుకెళ్ల వచ్చు.
