Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నంలో విషాదం.. ఇద్దరు కూతుర్లను చంపి, తండ్రి ఆత్మహత్య..

విశాఖపట్నంలో ఓ తండ్రి ఇద్దరు కూతుర్లను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. 

father kills two daughters, committed suicide in Visakhapatnam - bsb
Author
First Published Jan 20, 2023, 6:48 AM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను అతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన  గురువారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం మెట్టు ప్రాంతంలో జరిగింది. ఇది వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే దీనికి కారణం ఆర్థిక బాధలు తట్టుకోలేకపోవడమేనని పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చారు.  కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పిల్లా దుర్గా ఆంజనేయ ప్రసాద్ (42)గా  గుర్తించారు. 

అతను నాగమణి అనే మహిళని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇది అతని తల్లి అనసూయకు ఇష్టం లేదు. దీంతో దుర్గాప్రసాద్ కంచరపాలానికి వెళ్లకుండా చాలాకాలం భార్యతో కలిసి ఏలూరులోనే కాపురం ఉన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. బిందు (15), భార్గవి (13).  కుటుంబ పోషణ నిమిత్తం ఎలక్ట్రికల్ పనులు, ప్లంబింగ్ పనులు చేసేవాడు. ఆయన భార్య నాగమణి అనారోగ్యంతో 2013లో అనుకోకుండా చనిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలను తీసుకుని తిరిగి విశాఖపట్నం చేరాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అతడిని ఆర్థిక బాధలు చుట్టుముట్టాయి. వీటిని తట్టుకోలేని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

నాకే రక్షణ లేనప్పుడు సాధారణ మహిళ పరిస్థితి ఏంటీ?: ఓ కారు డ్రైవర్ తనను ఈడ్చుకెళ్లాడన్న స్వాతి మలివాల్

గురువారం ఉదయం దుర్గాప్రసాద్ ఊర్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్లాడు. ఆమె దగ్గర టీ తాగి వచ్చాడు. ఆ సమయంలో అతను చాలా బాధగా ఉన్నట్లు తల్లి గుర్తించింది. దీంతో గురువారం సాయంత్రం  కొడుకుతో మాట్లాడదామని అతడి ఇంటికి వచ్చింది. అయితే ఎంతసేపటికి తలుపు తీయలేదు. ఎన్నిసార్లు పిలిచినా తలుపు కొట్టిన సమాధానం లేదు. దీంతో ఆమె డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కిటికీ అద్దాలు పగల కొట్టి తలుపులు తీసి చూసారు. ఒక గదిలో దుర్గాప్రసాద్ మృతదేహం..మరో గదిలో అతని ఇద్దరు కుమార్తెల మృగదేహాలు ఉండడం గుర్తించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios