దారుణం: ఇద్దరు కొడుకులను చంపి తండ్రి పరార్

దారుణం: ఇద్దరు కొడుకులను చంపి తండ్రి పరార్

గుంటూరు:  గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపేసి పరారయ్యాడు. గుంటూరులోని మాచర్ల చెన్నకేశవ నగర్ లో ఈ సంఘటన జరిగింది.

తండ్రి చేతిలో హత్యకు గురైన ఇద్దరు పిల్లలు కూడా మానసికంగా ఎదుగుదల లేనివారు. వారిని చంపిన నిందితుడు బ్రహ్మానంద రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బ్రహ్మానంద రెడ్డి దివ్యాంగులైన ఇద్దరు పిల్లలతో శుక్రవారం రాత్రి ఓ గదిలో పడుకోగా, ఆయన భార్య చిన్న కుమారుడితో మరో గదిలో పడుకుంది. తెల్లారి ఆమె లేచి చూసే సరికి తన ఇద్దరు పిల్లలు కూడా శవాలై కనిపించారు. భర్త జాడ లేదు.

కుటుంబానికి ఏ విధమైన ఆర్థిక సమస్యలు లేవని తెలుస్తోంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న బ్రహ్మానంద రెడ్డి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో తాను చనిపోతే మానసికంగా ఎదగని ఇద్దరు కుమారులు అనాథలై పోతారని అతను భావించి ఉంటాడని, దాంతో వారిద్దరని చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

పిల్లలను చంపిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మానంద రెడ్డి భార్య మాట్లాడే స్థితిలో కూడా లేదు. ఆమె వేదన వర్ణనాతీతంగా ఉంది. చిన్న కుమారుడు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page